Home |  | Audio |  | Index |  | Verses

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 Chronicles

అధ్యాయం: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
1 అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.
2 నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియా జరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి.
3 దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.
4 వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమ పితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో ఎనిమిదిమంది తమ తమ పితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి.
5 ​ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి.
6 లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదు టను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతా మారు పేరటను తీయబడెను.
7 మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదా యాకు,
8 మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీము నకు,
9 అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు,
10 ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు,
11 తొమి్మదవది యేషూవకు పదియవది షెకన్యాకు పదకొండవది ఎల్యాషీబునకు,
12 పండ్రెండవది యాకీమునకు,
13 పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబునకు,
14 ​పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు,
15 ​పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు,
16 పందొమి్మదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు,
17 ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు,
18 ఇరువది మూడవది దెలాయ్యాకు, ఇరువదినాలుగవది మయజ్యాకు పడెను.
19 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను.
20 శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,
21 రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును,
22 ఇస్హారీ యులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,
23 హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును,
24 ఉజ్జీయేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో షామీరును,
25 ఇష్షీయా సంతతిలో జెకర్యాయును,
26 మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును.
27 యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ.
28 మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి.
29 కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు.
30 మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు,వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీ యులు.
31 ​వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.

ముద్రించు Print This Page

పైన Top |  | తదుపరి పేజీ  |  | Index |  | Home


Full online version here [with search engine, multilingual display and audio Bible]