Home |  | Audio |  | Index |  | Verses

సంఖ్యాకాండము Numbers

అధ్యాయం: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36
1 మోషే అహరోనులవలన తమ తమ సేనలచొప్పున ఐగుప్తుదేశములోనుండి బయలుదేరివచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి.
2 మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము, వారి ప్రయాణములనుబట్టి వారి సంచారక్రమములను వ్రాసెను. వారి సంచారక్రమ ముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి.
3 ​మొదటి నెల పదునయిదవ దినమున వారు రామెసేసులో నుండి ప్రయాణమై పస్కాపండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలుల నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నులయెదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి.
4 ​అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను.
5 ​ఇశ్రాయేలీయులు రామె సేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి.
6 సుక్కో తులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతా ములోదిగిరి.
7 ఏతాములోనుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతుతట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి.
8 పీహహీరోతులోనుండి బయలుదేరి సముద్రము మధ్యనుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడుదినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలోనుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి.
9 ​ఏలీములో పండ్రెండు నీటిబుగ్గ లును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి.
10 ​ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱ సముద్రము నొద్ద దిగిరి.
11 ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి.
12 సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి
13 దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి.
14 ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను.
15 ​రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.
16 సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి.
17 కిబ్రోతుహతా వాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి.
18 హజే రోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి.
19 ​రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి.
20 రిమ్మోను పారె సులోనుండి బయలు దేరి లిబ్నాలో దిగిరి.
21 లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి.
22 ​రీసాలోనుండి బయలు దేరి కెహేలా తాలో దిగిరి.
23 ​కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి.
24 ​​షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి.
25 ​హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి.
26 ​మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి.
27 తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి.
28 తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.
29 మిత్కాలోనుండి బయలు దేరి హష్మోనాలో దిగిరి.
30 ​హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.
31 ​మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.
32 బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి.
33 ​హోర్‌హగ్గిద్గా దులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి.
34 యొత్బా తాలోనుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి.
35 ఎబ్రో నాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.
36 ఎసోన్గె బెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్య ములో దిగిరి.
37 కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి.
38 ​యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.
39 అహ రోను నూట ఇరువది మూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను.
40 అప్పుడు దక్షిణదిక్కున కనాను దేశమందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను.
41 వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి.
42 ​సల్మానాలో నుండి బయలుదేరి పూనొనులో దిగిరి.
43 పూనొనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి.
44 ​ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి.
45 ఈయ్యె అబారీములోనుండి బయలు దేరి దీబోనుగాదులో దిగిరి.
46 దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి.
47 అల్మోను దిబ్లా తాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబా రీము కొండలలో దిగిరి.
48 అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి.
49 వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దానుదగ్గర దిగిరి.
50 యెరికోయొద్ద, అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
51 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముమీరు యొర్దానును దాటి కనానుదేశమును చేరిన తరువాత
52 ఆ దేశనివాసులందరిని మీ యెదుట నుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటిని పాడుచేసి
53 ​ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు ఆ దేశమును మీకిచ్చితిని.
54 మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను.
55 అయితే మీరు మీ యెదుటనుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టనియెడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లు గాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి, మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు.
56 మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము.

ముద్రించు Print This Page

పైన Top |  | తదుపరి పేజీ  |  | Index |  | Home


Full online version here [with search engine, multilingual display and audio Bible]