Home |  | Audio |  | Index |  | Verses

సంఖ్యాకాండము Numbers

అధ్యాయం: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36
1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెనునీవు ఇశ్రాయేలీయులతో
2 కనాను దేశమున, అనగా పొలిమేరలచొప్పున మీరు చీట్లువేసి స్వాస్థ్యముగా పంచుకొను కనానుదేశమున
3 మీరు ప్రవేశించుచుండగా, మీ దక్షిణదిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు, అనగా
4 ​మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సము ద్రముయొక్క తూర్పు తీరమువరకు ఉండును. మీ సరి హద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనమయొద్ద తిరిగి సీనువరకు వ్యాపించును. అది దక్షిణమునుండి కాదేషు బర్నేయవరకు వ్యాపించి, అక్కడనుండి హసరద్దారువరకు పోయి, అక్కడనుండి అస్మోనువరకు సాగును.
5 ​అస్మోనునుండి ఐగుప్తు నదివరకు సరిహద్దు తిరిగి సముద్రమువరకు వ్యాపించును.
6 ​పడమటి సరిహద్దు ఏద నగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును.
7 మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్దనుండి హోరు కొండవరకు ఏర్పరచుకొనవలెను.
8 హోరు కొండ యొద్దనుండి హమాతునకు పోవుమార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదువరకు వ్యాపించును.
9 అక్కడనుండి సరిహద్దు జిప్రోనువరకు వ్యాపించును, దాని చివర హసరేనానునొద్ద ఉండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు.
10 తూర్పు సరిహద్దు హసరేనానునుండి షెపామువరకు మీరు ఏర్పరచుకొన వలెను.
11 ​షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పున రిబ్లావరకు నుండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నె రెతు సముద్రమునొడ్డును తగిలియుండును.
12 ​ఆ సరిహద్దు యొర్దానునదివరకు దిగి ఉప్పు సముద్రముదనుక వ్యాపిం చును. ఆదేశము చుట్టునున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదై యుండునని వారి కాజ్ఞాపించుము.
13 ​మోషే ఇశ్రాయేలీయులతోమీరు చీట్లచేత పొంద బోవుచున్న దేశము ఇది. యెహోవా తొమి్మది గోత్ర ములకును అర్ధగోత్రమునకును దీని నియ్యవలెనని ఆజ్ఞా పించెను;
14 ​ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులును గాదీయులును తమ తమ స్వాస్థ్యముల నొందిరి.
15 మనష్షే అర్ధగోత్రపువారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ రెండు గోత్రపువారును అర్ధ గోత్రపువారును సూర్యోదయ దిక్కున, అనగా తూర్పు దిక్కున యెరికోయొద్ద యొర్దాను ఇవతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను.
16 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
17 ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసినవా రెవరనగా, యాజకుడైన ఎలియాజరును నూను కుమారు డైన యెహోషువయు.
18 మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక ప్రధానుని ఏర్పరచుకొనవలెను.
19 వారెవ రనగా, యూదావారి గోత్రములో యెఫున్నె కుమారు డైన కాలేబు.
20 షిమ్యోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు,
21 ​బెన్యామీనీయుల గోత్ర ములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు.
22 ​దానీయుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కీ ప్రధాని,
23 యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీయుల గోత్రప్రధాని,
24 ఎఫ్రాయిమీయుల గోత్ర ములో షిప్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని,
25 జెబూలూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని,
26 ఇశ్శాఖారీయుల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని,
27 ఆషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని.
28 నఫ్తాలీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని.
29 కనాను దేశములో ఇశ్రాయేలీయులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టు టకు యెహోవా ఆజ్ఞాపించినవారు వీరే.

ముద్రించు Print This Page

పైన Top |  | తదుపరి పేజీ  |  | Index |  | Home


Full online version here [with search engine, multilingual display and audio Bible]